కేసీఆర్ చేయనిది.. రేవంత్ ఫస్ట్ రోజే చేశారు?
నిన్న సీఎం అయిన రేవంత్ రెడ్డి తొలిరోజే దీనిపై నిర్ణయం తీసుకున్నారు. వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం లోని ప్రొఫెసర్ జయశంకర్ స్వగ్రామమైన అక్కంపేట గ్రామాన్ని రెవిన్యూ గ్రామంగా ప్రకటిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయించారు. ఈ మేరకు ప్రిలిమినరి నోటిఫికేషన్ ఇస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జీ.ఓ. నెంబర్ 405 తేదీ. 7.12.2023ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ అక్కంపేట గ్రామం పెద్దాపూర్ గ్రామంలో భాగంగా ఉన్నది.