ఇవాళ మోదీ వెళ్లే ప్లేస్‌ ప్రత్యేకత తెలిస్తే షాక్‌?

Chakravarthi Kalyan
ఇవాళ ప్రధాని మోదీ రంగారెడ్డి జిల్లాలోని కన్హా శాంతి వనాన్ని సందర్శించనున్నారు. శ్రీరామచంద్ర మిషన్ వ్యవస్థాపకులు షాజహాన్‌పూర్ 125వ జయంతి పురస్కరించుకుని ప్రధాని ఒక స్మారక ఫలకం ఆవిష్కరిస్తారు. ఈ కన్హా శాంతి వనం వివరాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. 2020లో అప్పటి రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా కన్హ శాంతి వనం ప్రారంభమైంది. ఏటా దేశ, విదేశాల నుంచి పెద్ద ఎత్తున సందర్శకులు ఇక్కడకు వస్తారు. ధ్యానం, యోగా సాధన చేస్తుంటారు. 10 లక్షల మొక్కలు నాటడం, నర్సరీలు, అంతరించిపోతున్న 280 తీవ్రమైన జాతులు కొలువు తీరడంతో ఈ శాంతి వనంలో జీవ వైవిధ్యం ఉంది.

ఇక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన మందిరం ఉంది. అభ్యాసం, యోగా, ధ్యానం, ఆరోగ్యం, స్థిరమైన జీవనం, పర్యావరణ పరిరక్షణ, నీటి సంరక్షణ కోసం సంపూర్ణ కేంద్రంగా ఇది పనిచేస్తుంది. కన్హా శాంతి వనం క్రీడలు, సంగీతం, చలన చిత్రం, విద్యను ప్రోత్సహిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: