జగన్ పాలనకు, బాబు పాలనకు అదీ తేడా?
చంద్రబాబు 30 లక్షల మందికి వెయ్యి రూపాయల పింఛన్ ఇస్తే, ఈరోజు రూ.2,750 చొప్పున 64 లక్షల మందికి జగన్ ఇస్తున్నారని.. ఫీజు రీయింబర్స్మెంట్ అంటే గుర్తుకొచ్చేది వైయస్సారేనని.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు చంద్రబాబు తూట్లు పొడిచారని మంత్రి పినిపె విశ్వరూప్ అంటున్నారు. 30 శాతం స్లాబ్ విధించి 70 శాతం తల్లిదండ్రులు కట్టుకోవాలని విద్యార్థులను చంద్రబాబు గాలికొదిలేశాడని... మళ్లీ జగనన్న రాగానే వైయస్సార్ హయాంలో మాదిరిగా పూర్తి ఫీజు ఇస్తున్నారని మంత్రి పినిపె విశ్వరూప్ అన్నారు.