సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న బర్రెలక్క?
సోషల్ మీడియాలో తనకు వస్తోన్న అనూహ్య ఆదరణతో శిరీష్ రెట్టించిన ఉత్సాహంతో ప్రచారం చేస్తోంది. అయితే.. ఇటీవల ఆమె ప్రచారంపై దాడి జరగడం.. ఆమె బేలగా రోదించడం యూట్యూబ్లో సంచలనంగా మారాయి. మొదట్లో లైట్ తీసుకున్న ప్రధాన అభ్యర్థులు ఇప్పుడు ఆమెకు వస్తున్న ఆదరణ చూసి భయపడుతున్నారు. తాజాగా శిరీష తన మేనిఫెస్టోని కూడా విడుదల చేసింది. మొత్తం మీద కొల్లాపూర్లో ఓ నిరుపేద విద్యావంతురాలు ఇండిపెండెంట్గా నిలుచుని సంచలనం సృష్టిస్తోంది. శిరీష్ గెలిస్తే మాత్రం అది మామూలు సంచలనం కాదు మరి.