ఆంధ్రాలో కులాల లెక్కలు తేల్చనున్న జగన్‌?

Chakravarthi Kalyan
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్ కులాల లెక్కలు తేల్చబోతున్నారు. ఏ కులం వారు ఎంత మంది ఉన్నారో లెక్కలు తీయబోతున్నారు. కులగణన నిర్వహించేందుకు జగన్ సర్కార్ మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ కులగణన సామాజిక ఆర్ధిక పరిస్థితులు బేరీజు వేసి సంక్షేమ పథకాల రూపకల్పన, అమలుకు ఉపకరిస్తుందని జగన్ ప్రభుత్వం చెబుతోంది. డీబీటీ ద్వారా 2.37 లక్షల కోట్లు 8.22 కోట్ల మంది లబ్దిదారుల ఖాతాల్లోకి వెళ్లాయన్న జగన్ సర్కార్ వెనుకబడిన వర్గాల పూర్తి సమాచారం లేకపోవటం పథకాల అమలుకు ఇబ్బందిగా మారిందని చెబుతోంది.


జన గణనలో  ఓబీసీలు, ఇతర ఉపవర్గాల సమాచారం లేకపోవటంతో అనువైన పథకాలను రూపకల్పన చేయలేని పరిస్థితి ఏర్పడుతోందని జగన్ సర్కార్ చెబుతోంది. కులగణన ద్వారా లోపాలను గుర్తించి వారికి అవసరమైన సంక్షేమ పథకాలను రూపోందించే అవకాశముందని జగన్ సర్కార్ అంటోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: