దూకుడు పెంచిన బీజేపీ.. అగ్రనేతల క్యూ?

Chakravarthi Kalyan
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాజపా దూకుడు పెంచింది. తెలంగాణపై ఆ పార్టీ అగ్రనేతలంతా ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇప్పటికే ఓసారిఎన్నికల ప్రచారానికి వచ్చిన ప్రధాని మోదీ మరోసారి వస్తున్న మోదీ మూడు రోజుల పాటు ఎన్నికల ప్రచారం చేయనున్నారు. రేపు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర పడ్నవిష్‌, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రాష్ట్రానికి వస్తున్నారు. ముషీరాబాద్‌ లో దేవేంద్ర పడ్నవిష్‌, జూబ్లీహిల్స్‌ లో నిర్మలా సీతారామన్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.


ఈనెల 24,25,26,28 తేదీల్లో అమిత్ షా,... 23,25,26,27 తేదీల్లో రాష్ట్రానికి జేపీ నడ్డ వస్తున్నారు. జేపీ నడ్డా ఈనెల 23 న ముదొల్, సంగారెడ్డి,  నిజామాబాద్ అర్బన్ సభలతో పాటు హైదరాబాద్ రోడ్ షో లో పాల్గొంటారు. ఈ నెల 24,25,26 తేదీలలో యోగి ఆదిత్యనాత్...22న వరంగల్ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. 25,26,27 మూడు రోజుల పాటు రాష్ట్రంలో ప్రధాని మోడీ సభలుంటాయి. ఈ నెల 22 నుంచి 27 వరకు హిమంత్ భిశ్వా శర్మ ఎన్నికల ప్రచారంలో  పాల్గొంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp

సంబంధిత వార్తలు: