టీఆర్‌ఎస్‌ బీఆర్‌ఎస్‌ ఎందుకైందో సీక్రెట్‌ చెప్పిన అమిత్‌షా?

Chakravarthi Kalyan
ఏడాది క్రితం టీఆర్ఎస్ కాస్తా బీఆర్ఎస్ అయ్యింది. దేశవ్యాప్తంగా విస్తరించాలని చూస్తోంది. అయితే ఆ దిశగా ప్రయత్నాలు పెద్దగా జరగట్లేదు. అయితే.. ఈ పేరు మార్పు వెనుక అసలు రహస్యం వేరే ఉందంటున్నారు కేంద్ర మంత్రి అమిత్‌షా. కేవలం తాంత్రికులు చెప్పారని.. కేసీఆర్ పార్టీ పేరును టీఆర్ఎస్ నుంచి బీఆర్‌ఎస్‌కు మార్చాడని ఆయన ఆరోపించారు. తాంత్రికులు చెప్పినట్లుగా వారి సలహాల మేరకు కేసీఆర్ నడుచుకుంటున్నారని కేంద్ర మంత్రి అమిత్‌షా అంటున్నారు.

కేసీఆర్.. గతంలో తెలంగాణ విమోచన దినోత్సవం ఏర్పాటు చేయాలని చెప్పి ఇప్పుడు మాత్రం నిర్వహించడం లేదని అమిత్‌ షా ఆరోపించారు. కేవలం ఒవైసీకి భయపడి కేసీఆర్ వాటిని నిర్వహించడం లేదు అమిత్‌ షా  అన్నారు. కుటుంబ పాలనకు కేసీఆర్ పరిమితమయ్యారని.. కేటీఆర్ ను సీఎం చేయడమే లక్ష్యంగా ఆయన పనిచేస్తున్నారని అమిత్‌ షా  అన్నారు. నీళ్లు, నిధులు, నియమకాల పేరిట తెలంగాణ ఏర్పాటు కోసం పోరాడితే.. అవి అమలు కాలేదన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

brs

సంబంధిత వార్తలు: