తెలంగాణలో రాహుల్ సుడిగాలి పర్యటన.. ఎప్పుడంటే?
ఈనెల 17 మధ్యాహ్నం 12 గంటల వరకు రాహుల్ గాంధీ పినపాకలో రోడ్ షో, కార్నర్ సమావేశం నిర్వహిస్తారు. పినపాక నుంచి హెలికాప్టర్‌లో నర్సంపేటకు చేరుకుని రాహుల్ గాంధీ 3 గంటల వరకు ప్రచారం చేస్తారు. నర్సంపేట నుంచి రోడ్డు మార్గంలో వరంగల్ ఈస్ట్ చేరుకుంటారు. వరంగల్ ఈస్ట్ లో సాయంత్రం నాలుగు గంటలకు రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తారు. వరంగల్ ఈస్ట్ నుంచి వెస్ట్‌లో కూడా రాహుల్ గాంధీ ప్రచారం నిర్వహిస్తారు. అదే రోజుసాయంత్రం 6.30 గంటలకు రోడ్డు మార్గంలో రాజేంద్రనగర్ వచ్చి అక్కడ ప్రచార సభలో పాల్గొంటారు. అనంతరం అక్కడ నుంచి రాహుల్ గాంధీ నేరుగా ఢిల్లీ వెళ్తారు.