ఎల్బీ నగర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి ఇంటిపై సోదాలు?

Chakravarthi Kalyan
ఎల్ బి నగర్ కాంగ్రెస్ అభ్యర్ధి మధుయాష్కీ గౌడ్ నివాసంలో సోదాలు చేసేందుకు పోలీసులు రావడం కలకలం రేపింది. సోదాలు చేయడానికి వచ్చిన పోలీసులను ఎల్ బి నగర్ కాంగ్రెస్ అభ్యర్ధి మధుయాష్కీ గౌడ్ అడ్డుకున్నారు. మధు యాష్కీ ఇంట్లో భారీగా నగదు ఉందని ఆరోపణలతో సోదాలు చేయడానికి పోలీసులు వచ్చినట్టు తెలుస్తోంది. డయల్ 100 ద్వారా ఫిర్యాదు రావడంతో ఎల్ బి నగర్ కాంగ్రెస్ అభ్యర్ధి మధుయాష్కీ గౌడ్ ఇంటికి చేరుకున్నట్లు తెలుస్తోంది.
అయితే.. ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా తన నివాసంలో సోదాలు ఎందుకు చేస్తారని పోలీసులను ఎల్ బి నగర్ కాంగ్రెస్ అభ్యర్ధి మధుయాష్కీ గౌడ్  ప్రశ్నించారు. పోలీసులు సోదాల పేరుతో తన కుటుంబ సభ్యులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఎల్ బి నగర్ కాంగ్రెస్ అభ్యర్ధి మధుయాష్కీ గౌడ్  ఆరోపించారు. మరి ఇది ఎటు దారి తీస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: