జగన్ కంటే బాబే బెటర్ అని పురందేశ్వరి అంటున్నారా?

Chakravarthi Kalyan
ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి ఇటీవల మద్యం అంశంపై చేసిన విమర్శలు రాజకీయ కలకలం రేపుతున్నాయి. పురందేశ్వరిపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. పురందేశ్వరి తన మరిది చంద్రబాబుకు మద్దతు ఇవ్వటంతో పాటు; మద్యం బెల్ట్‌ షాపులకు, మద్యం భారీ అమ్మకాలకు, మద్యం లాబీలకు అనుకూలంగా మాట్లాడుతున్నారని వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి అంటున్నారు.


పురందేశ్వరి తండ్రి పెట్టిన మద్య నిషేధాన్ని ఎత్తేసిన ఆమె మరిదికి మద్దతు ఇచ్చి అప్పట్లో మీ తండ్రి ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన మీరు... ఇప్పటికీ చంద్రబాబు మద్యం విధానమే బాగుందని చెపుతున్నారంటే, ఇంతకంటే రాజకీయ పతనం ఉంటుందా అని వరుదు కల్యాణి విమర్శిస్తున్నారు. మద్యం అమ్మకాలు పెంచితే మద్యం ఉత్పత్తి–అమ్మకపు సంస్థలు ముడుపులు చెల్లిస్తాయా? లేదా లాభాపేక్ష లేకుండా ప్రభుత్వమే మద్యం అమ్ముతూ, మద్యం ఉత్పత్తి–అమ్మకాలను తగ్గిస్తే ఎవరికైనా ముడుపులు వస్తాయా అని వరుదు కల్యాణి నిలదీశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: