సీఎం కేసీఆర్ దాదాపు పదేళ్లు పాలించారు. ఇప్పుడు మరోసారి సీఎం అవ్వాలని భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ వీస్తున్నట్టు కనిపిస్తోంది. మరి కేసీఆర్ అధికారం నిలబెట్టుకుంటారా.. లేదా అధికారం కోల్పోతారా అన్నది ఎన్నికల తర్వాత కానీ తేలదు. అయితే.. కేసీఆర్ పదేళ్ల పాలనను పరిశీలిస్తే.. బాగానే ఉందనే మాట జనం నుంచి వినిపిస్తోంది. అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు, సాగునీటి ప్రాజెక్టులు, ఐటీ రంగంలో ప్రగతి, హైదరాబాద్ అభివృద్ధి, గొడవలు లేని హైదరాబాద్.. ఇలా అనేక రంగాల్లో కేసీఆర్ పాలన పట్ల సంతృప్తి కనిపిస్తోంది.
అయితే.. కేసీఆర్ కుటుంబం అహంకారమే ప్రజలకు రుచించట్లేదన్న విమర్శలు కూడా ఉన్నాయి. జనంలోకి రాకపోవడం, ఫామ్ హౌస్‌కు అంకితం కావడం, నియంతృత్వ పోకడులు.. తాము ఏం చేసినా చెల్లుతుందన్న భావన కనిపించడం వంటి లక్షణాలు ప్రజలకు నచ్చడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరి అంతిమంగా ప్రజలు ఏం చేస్తారో చూడాలి.