మాజీ సీఎం కొడుకుకే బీజేపీ పగ్గాలు.. ఇదేం నిర్ణయం?
వచ్చే ఎంపీ ఎన్నికల్లో ఈ సీనియర్ లింగాయత్ నేత ప్రభావం చూపిస్తారని బీజేపీ భావిస్తోంది. ఈ నియామకం ద్వారా రాజకీయంగా లబ్ది పొందాలని అధిష్ఠానం భావిస్తోంది. ఈ ఏడాది జరిగిన కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయేంద్ర గెలిచారు. అయితే ఇప్పటివరకు కర్ణాటక భాజపా అధ్యక్షునిగా నళిన్ కుమార్ కటీల్ ఉన్నారు. మే నెలలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఓటమి దృష్ట్యా ఆయన్ను తప్పించారు. మరి ఈ కొత్త అధ్యక్షుడి నియామకం ఎంత మేరకు లబ్ది చేకూరుస్తుందో చూడాలి.