దీపావళి బాణసంచాపై నిషేధం.. సుప్రీంకోర్టు షాక్?
బాణసంచాలో బేరియంసహా నిషేధిత రసాయనాల వాడకానికి వ్యతిరేకంగా గతంలో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ ఆదేశాలు దిల్లీ సహా దేశమంతటికి వర్తిస్తాయని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. కొత్తగా మళ్లీ ఉత్తర్వులు అవసరం లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. రాజస్థాన్ తో పాటు అన్ని రాష్ట్రాలు పండుగల సమయంలో వాయు, శబ్ద కాలుష్యాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకుంటాయని భావిస్తున్నామని సుప్రీంకోర్టు తెలిపింది.