కాంగ్రెస్ లీడర్లపై కేసీఆర్ పోలీసులను ప్రయోగిస్తున్నారా?
కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో ఎవరూ గుమికూడొద్దని సంబంధిత కరీంనగర్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆదేశాలు ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోందంటూ సీఈఓ ఎదుట జి.నిరంజన్ ప్రస్తావించారు. ఎన్నికల సమయంలో జిల్లాకు చెందిన నాయకులు, కార్యకర్తలు సంప్రదింపుల కోసం డీసీసీ కార్యాలయానికి వచ్చి ఎన్నికల అవసరాల కోసం పార్టీ అందించిన ప్రింటెడ్ మెటీరియల్‌ను పొందుతున్న సమయంలో ఈ బెదిరింపులు తగదని జి.నిరంజన్ చెప్పారు. ఇలాంటి వేధింపులు నివారించేందుకు తక్షణమే కరీంనగర్ జిల్లా ఎన్నికల అధికారి, సీపీకి ఆదేశాలు ఇవ్వాలని జి.నిరంజన్ సూచించారు.