ఇవాళ హైదరాబాద్‌లో మోడీ సభ.. పెరిగిన హీట్
ప్రధాని సభ భద్రతను ఇద్దరు జాయింట్ సిపిలు, ముగ్గురు ఐపిఎస్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఈ విధుల్లో మరో 300 మంది ట్రాఫిక్ పోలీసులు పాల్గొంటున్నారు. ప్రధాని సభ దృష్ట్యా మధ్యాహ్నం 2గంటల నుంచి రాత్రి 8గంటల వరకూ ఎల్బీ స్టేడయం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సభకు హాజరయ్యే వారి కోసం ట్రాఫిక్ పోసులు 6చోట్ల ప్రత్యేక పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. బీసీలకే తెలంగాణ సీఎం సీటు అని ప్రకటించిన నేపథ్యంలో ఈ సభ హాట్ హాట్‌గా జరిగే అవకాశం ఉంది.