తెలంగాణ
బీజేపీ ఈ ఎన్నికల్లో
బీసీ కార్డు బాగా వాడుతోంది. అధికారమిస్తే.. బీసీని సీఎంను చేస్తామంటోంది. ఈ నెల 7న ఎల్బీ స్టేడియంలో బీసీల ఆత్మ గౌరవ సభ నిర్వహించబోతోంది. ఈ సభకు ముఖ్య అతిథిగా
ప్రధాన మంత్రి నరేంద్ర
మోదీ వస్తున్నారు. ప్రధాన మంత్రికీ ధన్యవాదాలు తెలిపే ఈ సభ నిర్వహిస్తారు. తెలంగాణలో అధికారంలోకి వస్తె బీసీనీ
ముఖ్యమంత్రి చేస్తామని ఇప్పటికే
కేంద్ర హోంశాఖ
మంత్రి ప్రకటించారు కూడా.
అయితే.. హోం
మంత్రి ప్రకటన,
భాజపా నిర్ణయాన్ని
కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతుందని.. బీసీలు
ముఖ్యమంత్రి అయ్యేది లేదు..
భాజపా అధికారంలోకీ వచ్చేది లేదని
రాహుల్ గాంధీ అవహేళన చేశారని
బీజేపీ నేతలు అంటున్నారు. అందుకే
బీసీ సమాజం తరలివచ్చి సత్తా చాటాలని..
బీసీ ఆత్మ గౌరవ సభను విజయవంతం చేయాలని పిలుపు ఇస్తున్నారు.
కాంగ్రెస్, భారాస అధికారంలోకి వస్తే బీసినీ ముఖ్యమంత్రినీ చేస్తామనే దమ్ముందా అని ప్రశ్నిస్తున్నారు.