పోలింగ్‌ రోజు ఆ జాగ్రత్త తప్పనిసరి.. ఈసీ ఆర్డర్‌?

Chakravarthi Kalyan
పోలింగ్‌కు ముందే సరిహద్దుల్లో ప్రజల రాకపోకలకు అవకాశం లేకుండా సరిహద్దులను మూసివేయాలన్న సీఈసీ రాజీవ్ కుమార్ సూచించారు. అత్యంత అప్రమత్తంగా ఉండాలని ప్రధాన కార్యదర్శులకు సీఈసీ ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలు, సరిహద్దు రాష్ట్రాల అధికారులతో ఈసీ దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు ఎసి పాండే, అరుణ్ గోయెల్‌ నిర్వహించిన ఈ సమీక్షలో తెలంగాణ సచివాలయం నుంచి సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీ కుమార్, సీఈఓ వికాస్ రాజ్ సమీక్షకు హాజరయ్యారు.

ఎన్నికల సంసిద్ధత, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిని వివరించిన సీఎస్.. సరిహద్దు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలతో పలు దఫాలు చర్చించినట్లు తెలిపారు. రాష్ట్రంలో నిఘా, పర్యవేక్షణ పెంచినట్లు తెలిపిన సీఎస్.. 17 సరిహద్దు జిల్లాల్లో 166 సరిహద్దు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పొరుగు రాష్ట్రాలు 154 సరిహద్దు చెక్‌పోస్టులను ఏర్పాటు చేసినట్లు తెలిపిన సీఎస్.. నవంబర్ 28వ తేదీ నుంచి పోలింగ్ జరిగే 30వ తేదీ వరకు రాష్ట్రంలో డ్రై డేగా ప్రకటించినట్లు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: