తెలంగాణలో దొరికిన సొమ్ము వంద కోట్లు దాటిందా?

frame తెలంగాణలో దొరికిన సొమ్ము వంద కోట్లు దాటిందా?

Chakravarthi Kalyan
తెలంగాణలో ఈసీ అధికారుల చొరవతో భారీగా తనిఖీలు జరుగుతున్నాయి. ఈ తనిఖీల్లో ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న నగదు, బంగారు ఆభరణాలు, కానుకలు, మద్యం విలువ 109.11 కోట్లు దాటటం సంచలనం కలిగిస్తోంది. ఇప్పుడే ఇలా ఉంటే.. ముందు ముందు ఎలా ఉంటుందో అన్న పరిస్థితి నెలకొంది. నిన్న ఉదయం నుంచి స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ 25.82 కోట్లుగా ఉంది. ఇప్పటి వరకు స్వాధీనం అయిన నగదు 58.96 కోట్లుగా ఉంది.

ఇప్పటి వరకు స్వాధీనం అయిన మద్యం విలువ 6.64 కోట్లుగా ఉంది. ఇప్పటి వరకు స్వాధీనం అయిన మాదక ద్రవ్యాల విలువ 2.97 కోట్లుగా ఉందని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు స్వాధీనం అయిన బంగారు, ఆభరణాల విలువ 33.62 కోట్లుగా ఉందని అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఇతర కానుకల విలువ 6.89 కోట్లుగా అధికారులు లెక్కించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు:

Unable to Load More