బాబు కోసం సంకెళ్లు.. లోకేష్‌, భువనేశ్వరి, బ్రాహ్మణి పిలుపు?

Chakravarthi Kalyan
చంద్రబాబుకు మద్దతుగా టీడీపీ మరో కార్యక్రమం చేపట్టింది. ఇవాళ సంకెళ్లు వేసుకుని నిరసన తెలపాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపు ఇచ్చారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా న్యాయానికి సంకెళ్లు పేరిట మరో వినూత్న కార్యక్రమానికి లోకేష్ పిలుపు ఇచ్చారు. ఆదివారం.. 15వ తేదీ రాత్రి 7 గంటల నుంచి 7.05 నిమిషాలు మధ్యలో చేతులకు తాడు లేదా రిబ్బను, గుడ్డతోనైనా కట్టుకొని నిరసన తెలియజేయండని నారా లోకేష్‌ పిలుపు ఇచ్చారు.


చంద్రబాబు ని  అక్రమంగా అరెస్ట్ చేయించి, న్యాయానికి సంకెళ్లు వేసిన  నియంతృత్వ పోకడలు దేశమంతా తెలియాలని నారా లోకేష్‌ అంటున్నారు. న్యాయానికి ఇంకెన్నాళ్లీ సంకెళ్లని నినదించాలని నారా లోకేష్‌ తెలిపారు. ఆ వీడియోలు ఫోటోలు సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసి చంద్రబాబు ధర్మ పోరాటానికి మద్దతుగా నిలవాలని నారా లోకేష్‌ విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే నారా లోకేష్‌ ఇలాంటి ఆందోళనలు గతంలోనూ నిర్వహించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: