ఇవాళ.. జగన్‌తో వైసీపీ నేతల అత్యంత కీలక సమావేశం?
వైసీపీ పార్టీ ప్రతినిధులలో ఎవరెవరు ఏ ఏ ప్రవేశమార్గాల నుంచి సమావేశమందిరంలోకి ప్రవేశిస్తారనే అంశంపై పరిశీలించారు. వైసీపీ పార్టీ అధ్యక్షులు, రాష్ర్ట ముఖ్యమంత్రి వైయస్ జగన్ హాజరవుతున్న దృష్ట్యా అన్ని రకాల భధ్రతా చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలకు, ట్రాఫిక్ కు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేసే క్రమంలో భాగంగా ప్రభుత్వం చేస్తున్న అభివృధ్ది-సంక్షేమ కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకువెళ్ళే ఆలోచనతో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు.