ఆంధ్రప్రదేశ్‌పై తెలంగాణ కంప్లయింట్‌?

Chakravarthi Kalyan
ఆంధ్ర ప్రదేశ్‌ పై కృష్ణా బోర్డుకు తెలంగాణ ఫిర్యాదు చేసింది. కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ ఈ మేరకు లేఖ రాసింది. కేఆర్ఎంబీ ఛైర్మన్ కు లేఖ రాసిన తెలంగాణ నీటిపారుదల ఈఎన్సీ మురళీధర్.. ఏపీ అక్రమంగా రాయలసీమ ఎత్తిపోతల పనులు చేపడుతోందని ఫిర్యాదు చేశారు. ఏపీ ప్రభుత్వం ఎన్జీటీ ఆదేశాలను ధిక్కరించి మరీ పనులు కొనసాగిస్తోందన్న తెలంగాణ ఆరోపించింది. 1976, 1977 అంతర్ రాష్ట్ర ఒప్పందాలకు విరుద్ధంగా బేసిన్ వెలుపలకు నీటిని తరలించే పనులు కొనసాగిస్తోందని తెలంగాణ ఫిర్యాదు చేసింది.


59 టీఎంసీల నీటిని తరలించేలా పనులు కొనసాగిస్తోందన్న తెలంగాణ రాష్ట్రం.. పనులు ఇలాగే కొనసాగితే రాష్ట్ర ప్రాజెక్టులపై ప్రతికూల ప్రభావం పడుతుందని వాదించింది. తక్షణమే స్పందించి ఏపీ అక్రమంగా కొనసాగిస్తున్న పనులను నిలిపివేయాలని కృష్ణా బోర్డును కోరిన తెలంగాణ ప్రభుత్వం.. తమ రాష్ట్రానికి న్యాయం చేయాలని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: