అదిరిపోయే మేనిఫెస్టో రెడీ చేస్తున్న టీ కాంగ్రెస్‌?

Chakravarthi Kalyan
తెలంగాణ కాంగ్రెస్‌ వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని భావిస్తోంది. ఓట్లు రాల్చే మేనిఫెస్టో తయారు చేసేందుకు కుస్తీ పడుతోంది. తమ మేనిఫెస్టో ప్రజల్లో మార్పు తెచ్చేలా ఉంటుందని మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్‌ శ్రీధర్‌ బాబు స్పష్టం అంటున్నారు. ఆచరణ సాధ్యం కానివి మేనిఫెస్టోలో ఉండవని కమిటీ ఛైర్మన్‌ శ్రీధర్‌ బాబు వెల్లడించారు. తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారో అవే ఉంటాయని శ్రీధర్‌ బాబు వివరించారు.


మేనిఫెస్టో ఏవిధంగా ఉండాలన్నఅంశంపై ఇటీవల పార్టీ కీలక నేతలు సుదీర్ఘంగా చర్చించారు. కేవలం వాగ్దానాలకే పరిమితం కాకుండా ఆచరణకు సాధ్యమయ్యేవే మేనిఫెస్టోలో ఉండాలని తాము భావిస్తున్నట్లు కమిటీ ఛైర్మన్‌ శ్రీధర్‌ తెలిపారు. మేనిఫెస్టోపై అన్నివర్గాల ప్రజలు తమ ఆలోచనలను, సలహాలను తమకు తెలియచేయాలని కమిటీ ఛైర్మన్‌ శ్రీధర్‌ సూచించారు. తాము ప్రకటిస్తున్న  డిక్లరేషన్‌లు, ఐదు గ్యారంటీ హామీలు కూడా మేనిఫెస్టోలో భాగమేనని కమిటీ ఛైర్మన్‌ శ్రీధర్‌ స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: