బాబు అరెస్టు వెనుక జగన్ ప్లాన్ అదేనా?
నిజంగా అదే జరిగి ఉంటుందా.. తాను మాత్రమే అవినీతిపరుడిని కాదని, చంద్రబాబు కూడా అవినీతిపరుడే అని చెప్పడమే చంద్రబాబు అరెస్టు వ్యవహారంలో జగన్ లక్ష్యం అన్నది నిజమేనా? ఇప్పుడు చంద్రబాబుకు కూడా అవినీతి మరక అంటించినందువల్ల ఇక జగన్మోహన్ రెడ్డి శాంతిస్తారా.. చంద్రబాబును అరెస్టు చేయడం వెనుక పగ, ప్రతీకారం తీర్చుకోవడమే కారణమా.. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో చంద్రబాబును జైలుకు పంపితే రాజకీయంగా ప్రయోజనం ఉంటుందని జగన్ భావించారా.. అన్న చర్చ జనంలో జరుగుతోంది.