బాబుకు సానుభూతి వెల్లువ.. సీఎం కావడమే మిగిలిందా?

Chakravarthi Kalyan
మొత్తానికి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు అరెస్టయ్యారు. అయితే చంద్రబాబు శ్రేయస్సును అమితంగా కోరుకునే ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ మాత్రం ఇక మా చంద్రబాబు సీఎం అయిపోవడమే మిగిలిందంటున్నారు తన కొత్త పలుకు వ్యాసంలో. ఆయన  మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ మాటలను కోట్ చేస్తున్నారు. ఉండవల్లి ఏమన్నారంటే.. గతంలో ఇందిరాగాంధీని అరెస్టు చేసినప్పుడు, ఆ తర్వాత అవినీతి కేసులలో జగన్మోహన్‌ రెడ్డిని అరెస్టు చేసినప్పుడు ప్రజల్లో గొప్పగా సానుభూతి ఏర్పడిందట.


అందువల్ల ఇందిరాగాంధీ, జగన్ ఎన్నికల్లో లబ్ధి పొందారట. అందుకే ఆ లాజిక్ ప్రకారం ఇప్పుడు 73 ఏళ్ల వయసులో చంద్రబాబును అరెస్టు చేసినందున బాబు కూడా అధికారంలోకి వస్తారట. ఉండవల్లి ఫార్ములా ప్రకారం తెలుగుదేశం పార్టీ పట్ల ప్రజల్లో సానుభూతి ఏర్పడి తీరుతుందట. అందుకే రాజకీయాలకే కాదు, రాజకీయ నాయకులకు కూడా నిర్వచనం మారుతోందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: