అన్న
భార్య పై ప్రేమతో చివరకు ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తనతో పెళ్లికి అన్న
భార్య నిరాకరించడంతో అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బోయిన్పల్లి
పోలీస్ స్టేషన్ పరిధిలోని
అలీ కాంప్లెక్స్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. హర్యానాకు చెందిన శివకుమార్, రీతులు భార్యాభర్తలు. వీరు నగరంలోని ఓల్డ్ బోయిన్పల్లి లో కూలీ పనులు చేసుకుంటు జీవనం సాగిస్తున్నారు. అన్న
భార్య రీతు తో
ప్రదీప్ కుమార్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.
ప్రదీప్ కుమార్, రీతు ల మధ్య గత కొంతకాలంగా అక్రమ సంబంధం కొనసాగుతోంది. అయితే
అన్నయ్య శివను వదిలి తనను వివాహం చేసుకోవాలని కొన్ని రోజులుగా రీతూను ప్రదీప్ కుమార్ ఒత్తిడి చేశాడు. ఆమె వివాహానికి నిరాకరించడంతో మనస్థాపానికి గురై అతను నివాసం ఉంటున్న గదిలో ఫ్యాన్ కు
ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.