తెలంగాణ కాంగ్రెస్ జాబితా.. మరింత ఆలస్యం?
ఈ నెల 15వ తేదీ లోపు మొదటి జాబితా విడుదల అవుతుందని భావించినా అది సాధ్యమయ్యే అవకాశం లేదు. స్క్రీనింగ్ కమిటీలో ప్రాధమిక అంశాలపై చర్చించిన కమిటీ సభ్యులు మరొకసారి సమావేశం కావాలని నిర్ణయించారు. ఎన్నికల కమిటీ సిఫారసు చేసిన అంశాలు, డీసీసీలు, సీనియర్ నాయకులు చేసిన సిఫారసులు, సలహాలు, సూచనలు అన్నింటిని చూసుకుని నివేదిక సిద్దం చేయాలి. దానిపై మరొకసారి చర్చించి పీఈసీ ఇచ్చిన సిఫారసులను పరిశీలించి సీఈసీకి పంపాలి. ఇందుకు కనీసం వారం, పది రోజులు పట్టే అవకాశం ఉంది.