తెలంగాణ కాంగ్రెస్‌లో ఉదయ్‌పూర్ డిక్లరేషన్ గొడవ?
2018 శాసనసభ ఎన్నికల్లో ఇతర పార్టీల నుంచి పోటీ చేసిన వారికి రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుండి టిక్కెట్లు ఇవ్వవద్దని కోదండరెడ్డి అన్నారు. పార్టీ జెండా పట్టుకుని క్షేత్రస్థాయిలో ఏళ్ల తరబడి పని చేస్తున్న పార్టీ కార్యకర్తలకు, ముఖ్యంగా యువత, యువ నాయకులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోదండరెడ్డి పేర్కొన్నారు. రైతుల పక్షాన పోరాడుతున్న, అధికార బీఆర్‌ఎస్ పార్టీకి వ్యతిరేకంగా అనేక పోరాటాల్లో అగ్రగామిగా నిలిచిన తెలంగాణ కిసాన్ కాంగ్రెస్‌కు కనీసం 3 టిక్కెట్లు ఇవ్వాలన్నారు.