రాఖీ రోజు లేడీస్‌ బస్సెక్కితే బంపర్‌ డ్రా?

Chakravarthi Kalyan
ఈ నెల 30, 31 తేదిల్లో సంస్థ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు రాఖీ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ లక్కీ డ్రా నిర్వహించనుంది. టికెట్ వెనకాల పేరు, ఫోన్ నంబర్ రాసి డ్రాప్ బాక్స్ లలో వాటిని వేయాల్సి ఉంటుంది. ప్రతి బస్టాండ్, ప్రయాణికుల రద్దీ ప్రాంతాల్లో తెలంగాణ ఆర్టీసీ డ్రాప్ బాక్స్ లను సంస్థ ఏర్పాటు చేసింది. మహిళా ప్రయాణికులందరూ ఈ లక్కీ డ్రాలో పాల్గొని విలువైన బహుమతులను గెలుచుకోవాలని తెలంగాణ ఆర్టీసీ విజ్ఞప్తి చేస్తుంది.

సెప్టెంబర్ 9లోగా లక్కీ డ్రాలు నిర్వహించి.. విజేతలకు బహుమతులను అందజేయడం జరుగుతుందని టీఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్, తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ఈ రాఖీ పౌర్ణమి లక్కీ డ్రాకు సంబంధించిన పూర్తి వివరాలకు టీఎస్‌ ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించి తెలుసుకోవచ్చు కూడా. ప్రతి రీజియన్ పరిధిలో లక్కీ డ్రా నిర్వహించి రీజీయన్ కు ముగ్గురి చొప్పున విజేతలను అధికారులు ఎంపికచేస్తారని తెలంగాణ ఆర్టీసీ వెల్లడించింది. ముఖ్య అతిథుల చేతుల మీదుగా విజేతలకు ఈ బహుమతులను తెలంగాణ ఆర్టీసీ అందజేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: