మున్నూరు కాపులకు పండుగే పండుగ?

Chakravarthi Kalyan
మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్రం ఆధ్వర్యంలో మున్నూరు కాపు ప్లీనరీ సన్నాహక సమావేశం జల విహార్ లో జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మున్నూరు కాపులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మనకు ఓ హోదా ఉంది కాబట్టి మనం పని చేసుకోవాలని మున్నూరు కాపులు కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరికి వెళ్లి మున్నూరు కాపుల కోసం  కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని అడిగామని.. ముఖ్యమంత్రి మన కులానికి పది సీట్లు ఇచ్చారని.. వాటిని గెలిపించుకుని డిమాండ్లను అడుగుదామని నేతలు అన్నారు.


మనపైన ఉన్న నమ్మకంతో మనకు పది సీట్లు ఇచ్చారని డిమాండ్స్ వెంటనే కావని.. సమయం పడుతుందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సర్ కు నో అనే పదం రాదని... కార్పొరేషన్ కూడా వస్తుందని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. మన డిమాండ్స్ నెరవేర్చే బాధ్యతను నా భుజాల మీద పెట్టుకుంటున్నాని మంత్రి గంగుల కమలాకర్ హామీ ఇచ్చారు. మనకు సంఖ్యా బలం ఉందని.. మా బిడ్డలను మేము గెలిపించుకుంటామని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

brs

సంబంధిత వార్తలు: