టీడీపీకి కొత్త పేరు ఖాయం చేసిన విజయసాయి?
తండ్రీ కొడుకులు చంద్రబాబు, లోకేశ్ ఇద్దరూ నోరు తెరిస్తే.. తంతాం, నరుకుతాం, పొడుస్తాం, తోలు తీస్తాం, చంపేస్తాం ఇవే మాటలు అంటున్నారట.
అసలు ప్రజాస్వామ్యంలో ఈ భాషను ఎవరైనా అంగీకరిస్తారా అని వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి ప్రశ్నిస్తున్నారు. టీడీపీలో అంతా సంఘ వ్యతిరేక శక్తులే ఉన్నారని.. వారి నాయకుడు కూడా గూండానే అని వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి అన్నారు. గూండాయిజం, రౌడీయిజం, హంతకులు అంతా కలిసిన పార్టీ టీడీపీ అని విజయసాయిరెడ్డి అంటున్నారు. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, వివిధ సామాజిక వర్గాలకు గతంలో చంద్రబాబు ఏం చెప్పారో గుర్తు చేసుకోవాలని వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి సూచించారు.