వైన్ షాప్ వేలానికి మస్త్ డిమాండ్.. ఇవాళే లాస్ట్‌డేట్?
మొన్నటి వరకు 44040 అర్జీలు రాగా నిన్న ఒక్కరోజే 25,925 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. నిన్నటి వరకు వచ్చిన దరఖాస్తుల సంఖ్య 69965కు చేరింది. ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.1399 కోట్లు ఆదాయం వచ్చింది. 2021లో వచ్చిన 1357 కోట్లు కంటే ఇది ఎక్కువ. ఇవాళ అధికారుల అంచనా మేరకు 30వేల అర్జీలు రావచ్చు. అంటే మరో ఆరువందల కోట్లు రాబడి ప్రభుత్వానికి రావచ్చు.