జోరు మీదున్న చంద్రబాబు.. ఇవాళ్టి నుంచి కోనసీమలో?

Chakravarthi Kalyan
టీడీపీ అధినేత చంద్రబాబు జోరు మీద ఉన్నారు. నిన్న విశాఖలో విజన్‌ 2047 కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు.. ఇవాళ్టి నుంచి మూడు రోజులు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించబోతున్నారు. ఈ జిల్లాలో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో చంద్రబాబు
పాల్గొనబోతున్నారు. అందులో భాగంగా ఇవాళ చంద్రబాబు మండపేట నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు.


రాజమండ్రి గ్రామీణ మం. తొర్రేడులో రాత్రి బస చేసిన చంద్రబాబు.. ఈ మధ్యాహ్నం 2 గంటలకు మడికి, దుళ్ల గ్రామాల మీదుగా మండపేట మండలం ఏడిదకు వెళ్తారు. ఏడిదలో స్థానిక రైతులతో రచ్చబండ కార్యక్రమం చంద్రబాబు నిర్వహిస్తారు. ఆ తర్వాత మండపేటలో రోడ్ షో నిర్వహిస్తారు. మండపేట కలవపపువ్వు సెంటర్ లో చంద్రబాబు బహిరంగ సభ నిర్వహిస్తారు. ఆ తర్వాత ఇవాళ రాత్రికి బాబు అండ్ బాబు ఫంక్షన్ హాల్లో చంద్రబాబు బస చేస్తారు. రేపు కొత్తపేట నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటన ఉంటుంది. ఆ తర్వాత ఎల్లుండి అమలాపురం నియోజకవర్గంలో చంద్రబాబు  పర్యటిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: