పవన్ కల్యాణ్: సంసారం బీజేపీతో.. సహజీవనం టీడీపీతో?
అసలు పవన్ కల్యాణ్‌కు ఒక విధానం, సిద్ధాంతం, లక్ష్యం, స్థిరత్వం లేదవి.. ఒకపక్క విప్లవవాదినంటూనే మరోపక్క బీజేపీతో కలిసి పనిచేస్తున్నానంటారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. 2014 నుంచి 2023 వరకు గడచిన 9 ఏళ్లుగా దాదాపు ఆరేడు పార్టీలతో పవన్ పొత్తులు పెట్టుకున్నారని.. వాటిల్లో ఒక పార్టీకి మరో పార్టీకి విధానాలు కలవవని అన్నారు. లక్ష్యాలు, సిద్ధాంతాలు వేరుగా ఉన్న పార్టీలతో కలిసి పవన్ ఎలా పనిచేస్తారని.. 2014లో తెలుగుదేశం, బీజేపీతో పొత్తు పెట్టుకున్న పవన్ అదే ఏడాది ఎన్నికలు వచ్చేసరికి సీపీఐ, సీపీఎం, బీఎస్పీలతో పొత్తు పెట్టుకున్నారని గుర్తు చేశారు.