ఇండియా 5 సంవత్సరాల్లో 370.11 మిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన మానవ జుట్టు ఇతర దేశాలకు ఎగుమతి చేసింది. 2018-19లో 34.46 మిలియన్ డాలర్లు, 2019-20లో 5.70 మిలియన్ డాలర్లు, 2020-21లో 11.65 మిలియన్ డాలర్లు, 2021-22 లో 149.07 డాలర్లు, 2022-23లో అత్యధికంగా 169.23 మిలియన్ డాలర్లు విలువ చేసే జుట్టును
ఇండియా ఇతర దేశాలకు ఎగుమతి చేసింది. మానవ జుట్టు, జుట్టు ఉత్పత్తుల అసోసియేషన్, ప్లెక్స్ కౌన్సిల్ లెక్కల ప్రకారం ప్రపంచంలో అత్యధికంగా జుట్టు లభించేది భారతదేశంలోనేనట.
ఇండియాలో లభించే జుట్టు అత్యంత నాణ్యమైనదిగా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ వాణిజ్య ప్రదర్శనలకు హాజరయ్యేందుకు పరిశ్రమలతో కలిసి ప్లెక్స్ కౌన్సిల్ చురుకుగా పనిచేస్తోంది. జుట్టుతో విగ్గులు వంటి విలువైన వస్తువులు ఉత్పత్తి చేసేందుకు ఎగుమతిదారులకు శిక్షణ ఇచ్చేలా ప్రభుత్వంతో కలిసి ప్లెక్స్ సంస్థ పనిచేస్తోంది.