ఎన్నో ఏళ్ల కల సాకారం చేస్తున్న జగన్?
ప్రావిజన్ ఆఫ్ ట్రాన్సఫర్స్ యాక్ట్ ప్రకారం.. చట్టం తెలియక భూమి కొన్నా, అమ్మినా ఆ భూమిపై హక్కులన్నవి హక్కుదారులకే దక్కాలి అన్న ఉద్దేశంతో ఇరవై ఏళ్ల సాగులో ఉన్నవారికి హక్కులు దఖలు పరుస్తూ వారి పరిధిలో ఉన్న అసైన్డ్ ల్యాండ్ ను అమ్ముకునే వీలు కల్పించింది జగన్ సర్కారు. 1977 నాటి పీఓటీ యాక్ట్ కు కొన్ని నిబంధనలు సడలించి లబ్ధిదారులకు భూమిపై హక్కు కల్పిస్తున్నారు. దీని ద్వారా 20 ఏళ్లు నిండి ఉంటే చాలు ఆ భూమి మీద పూర్తి హక్కుతో అమ్ముకునే అవకాశం దక్కింది.