పైనుంచి ఊడి పడ్డావా.. చిరుకు విజయసాయి షాక్‌?

Chakravarthi Kalyan
సినిమాటోగ్రాఫ్ బిల్లుపై పార్లమెంట్‌లో మాట్లాడితే కోట్ల రూపాయ‌ల‌కు పడ‌గ‌లెత్తిన కొంద‌రు హీరోలు భుజాలు ఎందుకు త‌డుముకుంటున్నారోన‌ని వైసీపీ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి.. మెగాస్టార్‌ చిరంజీవిపై షాకింగ్‌ కామెంట్స్ చేసారు. సినిమా పైర‌సీని అరిక‌ట్టడం ఎంత అవ‌స‌ర‌మో, సినీ కార్మికుల సంక్షేమం, సినీ ప‌రిశ్రమ‌లో ప‌నిచేసే మ‌హిళ‌ల భ‌ద్రత కూడా అంతే ముఖ్యమని ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.


ఉన్నమాటంటే ఉలుకెందుక‌ని చిరంజీవిని ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి ప్రశ్నించారు. సినీ రంగమేమీ ఆకాశం నుంచి ఊడి పడలేదని... ఫిలిం స్టార్స్‌ అయినా పొలిటిషియన్స్ అయినా ప్రజలు ఆదరిస్తేనే వారికి మనుగడ ఉంటుందని ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి అన్నారు. సినీ పరిశ్రమలోని పేదలు, కార్మికుల సంక్షేమం బాధ్యత కూడా ప్రభుత్వానిదేనని.. మా గురించి ప్రభుత్వానికి ఎందుకంటే కుదరదని... వారి యోగక్షేమాల పట్టించుకునే బాధ్యత ప్రభుత్వానికి ఉందని ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: