టీడీపీకి పుంగనూరు షాక్.. పోలీసులే కేసులు పెట్టారు?
అలాగే జయశంకర్ అనే కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మరో కేసులో చల్లా రామచంద్రారెడ్డి తో పాటు మరో 16 మంది తెదేపా కార్యకర్తలు, ఇతరులపై కేసు నమోదు చేశారు. మరో పోలీసు అధికారి నాగరాజా ఫిర్యాదుతో చల్లా రామచంద్రారెడ్డి తో పాటు 19 మంది తెలుగుదేశం క్యాడర్ పై హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. పాలసముద్రం ఎస్సై బి ప్రసాద్ ఫిర్యాదుతో చల్లా రామచంద్ర రెడ్డి తో పాటు మరో 37 మంది టీడీపీ కార్యకర్తలతో పాటు ఇతరులపై హత్యాయత్నం, వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.