సూపర్ స్టార్ జైలర్ ట్రైలర్ విడుదల?

Purushottham Vinay
తమిళ సీనియర్ స్టార్ హీరో ఆల్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న మూవీ 'జైలర్'. బీస్ట్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది.యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాని సన్ పిక్చర్స్ చాలా భారీగా నిర్మిస్తోంది. మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌ గా నటిస్తున్న ఈ మూవీలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ , మలయాళ సూపర్ స్టార్‌ మోహన్ లాల్ , నాగబాబు, సునీల్, జాకీ ష్రాఫ్, రమ్య కృష్ణ వంటి నటీ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 



ఈ సినిమా ఆగస్టు 10 వ తేదీన చాలా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా తమిళ్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు మేకర్స్.ఆ ట్రైలర్ విడుదల అయిన కొద్ది నిమిషాల్లోనే చాలా స్పీడ్ గా వ్యూస్ రాబడుతూ దూసుకుపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: