తక్షణ వరద సాయం ప్రకటించిన కేసీఆర్ సర్కార్‌?

Chakravarthi Kalyan
ఇటీవల వరదల్లో ఉక్కిరి బిక్కిరి అయిన వారికి కేసీఆర్ సర్కారు ఊరట కల్పించనుంది. వరదల్లో చనిపోయిన 40 మందికి కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని కేసీఆర్ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. వరదలకు తెగిన రోడ్లు, కల్వర్టులు మరమ్మతులు చేయాలని కేసీఆర్ కేబినెట్‌ నిర్ణయించింది. వర్షాలు, వరదల వల్ల రోడ్లు, పంటలకు తీవ్ర నష్టం కలిగిందని భావించిన కేసీఆర్ కేబినెట్‌.. తక్షణ సాయం కింద రూ.500 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించింది.

అలాగే వరదల సమయంలో చక్కగా పని చేసిన ఉద్యోగులను కూడా కేసీఆర్ సర్కారు సత్కరించనుంది. ఇద్దరు విద్యుత్‌ ఉద్యోగులు అద్భుతంగా విధులు నిర్వర్తించారని.. ఆ ఇద్దరు ఉద్యోగులను ఆగస్టు 15న సత్కరించాలని కేసీఆర్ కేబినెట్‌ నిర్ణయించింది. అలాగే ఆశ్రమ పాఠశాలలో 40 మంది పిల్లలను కాపాడిన టీచర్‌ను కూడా సన్మానించాని కేసీఆర్ కేబినెట్‌ నిర్ణయించింది. అలాగే రైతులకు విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని నిర్ణయం తీసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: