పపన్‌కు వాసిరెడ్డి పద్మ సవాల్.. స్వీకరిస్తారా?
మహిళా అభివృద్ధి కోసం రాష్ట్రంలో యజ్ఞం జరుగుతుంటే.. దాన్ని చెడగొట్టడానికి రాక్షసమూకల్లా ప్రయత్నం చేస్తున్నారని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. మహిళల ముందుకు వచ్చే ధైర్యం పవన్‌కు లేదన్న వాసిరెడ్డి పద్మ మహిళలు అడిగే ప్రశ్నలకు పవన్ సమాధానం చెప్పగలిగితే మరోసారి మహిళల అదృశ్యానికి, వలంటీర్ వ్యవస్థకు లింక్ పెట్టి మాట్లాడలేరని అన్నారు. రాజ్యసభలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి చేసిన ప్రకటనను చూపించి దానిపై పవన్ వక్రీకరణలు చేస్తున్నారని వాసిరెడ్డి పద్మ విమర్శించారు.