ఆ మాటలన్నందుకు.. హరీశ్‌రావు క్షమాపణ చెప్పాల్సిందేనా?
కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలను ఫనంగా పెట్టి విధులు నిర్వహించిన... సెకండ్ ఏఎన్ఎంలను రాష్ట్ర ప్రభుత్వం వెట్టి చాకిరీ చేయించుకుంటుందని ఆర్ కృష్ణయ్య మండిపడ్డారు. ఆరోగ్య తెలంగాణ సాధనలో వీరి పాత్ర కీలకమైందన్న ఆర్ కృష్ణయ్య .. వీరి సేవలను గుర్తించి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం పర్మినెంట్ చేసిందన్నారు. కర్ణాటక, ఏపీ రాష్ట్రాలలో జీతాలు పెంచాయని ఆర్ కృష్ణయ్య గుర్తు చేశారు.