సొంత హామీలు లేవా.. చంద్రబాబూ..?
చంద్రబాబు మహానాడులో చెప్పిన పథకాల్లో ఒక్కటన్నా ఆయన సొంత ఆలోచన ఉందా అని వైసీపీ నేతలు నిలదీస్తున్నారు. రెండు హామీలు జగన్ గారివి కాపీ కొట్టాడని.. ఒకటి కర్నాటక నుంచి, మరొకటి గోవా నుంచి కాపీ కొట్టాడని వైసీపీ నేతలు అంటున్నారు. అంతే కాదు.. గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చిన చరిత్ర అయినా ఉందా అంటే అదీ లేదని అంటున్నారు. చంద్రబాబును నమ్మి మోసపోవడానికి ఓట్లేయడానికి జనం పిచ్చోళ్లు కాదని వైసీపీ నేతలు చెబుతున్నారు.