ఉస్మానియా అలా వదిలేస్తారా.. ఉద్యమం తప్పదా?

Chakravarthi Kalyan
ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కు కొత్త బిల్డింగ్ కట్టాలని ఓజిహెచ్ జేఏసీ డిమాండ్ చేస్తోంది.  105 ఏళ్ల చరిత్ర కలిగిన ఉస్మానియా హాస్పిటల్ లో సరైన వసతులు లేక రోగులు, వైద్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు జేఏసీ ఛైర్మన్ డా పాండు నాయక్ తెలిపారు. ఇప్పుడున్న జనాభా ప్రకారం 3 వేల బెడ్స్ అవసరం ఉంటే... ప్రస్తుతం 4 వందల బెడ్ లపై పేషేంట్ లకు ట్రీట్మెంట్ ఇస్తున్నట్లు జేఏసీ ఛైర్మన్ డా పాండు నాయక్  తెలిపారు.

ఆర్థికంగా బలంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం ఏముందని జేఏసీ ఛైర్మన్ డా పాండు నాయక్ ప్రశ్నించారు. శిథిలావస్థకు వచ్చిన బిల్డింగ్ లో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని విధులు నిర్వహిస్తున్నట్లు జేఏసీ ఛైర్మన్ డా పాండు నాయక్  తెలిపారు. వారం రోజుల్లో ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. లేకపోతే తెలంగాణ రాష్ట్రం తరహాలోనే కొత్త బిల్డింగ్ సాధించుకుంటామని డా పాండు నాయక్ హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: