అవి కావాలంటే మళ్లీ జగనే సీఎం కావాలా?
ఆత్మకూరులో అభివృద్ది లేదని విమర్శించే వాళ్లు అక్కడికి వెళ్లి చూస్తే తెలుస్తుందని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. బుద్ధి, జ్ఞానం లేకుండా నారా లోకేష్ విమర్శలు చేస్తున్నాడన్న మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి.. వచ్చే ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపిస్తామని అన్నారు. నెల్లూరులో ఉన్న సాగు నీటి ప్రాజెక్టులు అన్నీ వైయస్ రాజశేఖరరెడ్డి, ఆయన తనయుడు సీఎం వైయస్ జగన్ పుణ్యమేనని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అంటున్నారు. పోలవరం, వెలిగొండ ప్రాజెక్టులు పూర్తి కావాలంటే మళ్లీ వైయస్ జగనే సీఎం కావాలని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు.