మరో కొత్త పథకం ప్రకటించిన సీఎం జగన్?

Chakravarthi Kalyan
ఏపీ సీఎం జగన్ మరో కొత్త పథకం ప్రకటించారు. ఇప్పటికే అమలవుతున్న జగనన్నకు చెబుదాం కార్యక్రమంతో పాటు ఈ నెల 23 నుంచి  జగనన్న సురక్ష కార్యక్రమం అమలు చేయాలని అధికార యంత్రాంగానికి చెప్పారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి అనుబంధంగా జగనన్న సురక్ష కార్యక్రమం ఉండాలని.. ఇందులో భాగంగా - వాలంటీర్లు, సచివాలయం  సిబ్బంది , గృహసారధులు ప్రతి ఇంటికి వెళ్లాలని సీఎం జగన్ ఆదేశించారు.

 జగనన్న సురక్ష పథకం లక్ష్యాన్ని వివరించి సమస్యలను పరిష్కరించాలన్న సీఎం జగన్‌.. - ఏవైనా పథకం అందని పరిస్ధితి ఉంటే జల్లెడ పట్టాలని అన్నారు. సచివాలయం పరిధిలో ఒక్కరికీ మిస్ కాకుండా ప్రతి సమస్యనూ పరిష్కరించాలని.. మండల , మున్సిపల్ స్థాయిలో అధికారులతో రెండు టీం లు  చొప్పున ఏర్పడాలని సీఎం జగన్‌ సూచించారు. ఎంపీడీవో, డిప్యూటీ తహసిల్దారు తో ఒకటి, తహసిల్దారు, పంచాయతీ రాజ్ రూరల్ డెవలప్ మెట్ ఈవో తో మరో టీంలు ఏర్పడాలని.. టీంలు సచివాలయాలకు వెళ్లి దృవపత్రాలు పంపిణీ సహా సమస్యలను వెంటనే ఈ టీంలు పరిష్కరించాలని సీఎం జగన్‌ ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: