జోరు పెంచిన జగన్.. రేపు ఆ జిల్లాలో యాత్ర?

Chakravarthi Kalyan
ఏపీ సీఎం జగన్ జోరు పెంచారు. ఎన్నికలు దగ్గరకు వస్తున్న సమయంలో జిల్లాల పర్యటనలు పెంచుతున్నారు. తాజాగా ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి రేపు ప‌ల్నాడు జిల్లాలో ప‌ర్యటించ‌బోతున్నారు. అక్కడ వరుసగా నాలుగో ఏడాది జగనన్న విద్యా కానుక పథకాన్ని ప్రారంభిస్తారు.
ప‌ల్నాడు జిల్లా క్రోసూర్‌లో నాలుగో ఏడాది జగనన్న విద్యా కానుక పథకాన్ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్రారంభించ‌నున్నారు. రేపు ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి సీఎం జగన్ బయల్దేరతారు. అక్కడి నుంచి  పల్నాడు  జిల్లా క్రోసూరు చేరుకుంటారు. క్రోసూరులో ఏపీ మోడల్‌ స్కూల్‌ వద్ద పెదకూరపాడు నియోజకవర్గ వివిధ అభివృద్ది పనులకు సీఎం జగన్ శంకుస్థాపనలు చేస్తారు. ఆ తర్వాత అక్కడ నిర్వహించే బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తారు. ఆ తర్వాత జగనన్న విద్యా కానుక పథకాన్ని సీఎం జగన్ ప్రారంభిస్తారు. తన ప్రసంగం అనంతరం సీఎం విద్యార్థులకు విద్యా కానుక‌ కిట్స్‌ అందజేస్తారు. కార్యక్రమం ముగిసిన తర్వాత అక్కడి నుంచి మళ్లీ సీఎం జగన్ తాడేపల్లి చేరుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: