చంద్రబాబు రహస్యాలపై సంచలన పుస్తకం?

Chakravarthi Kalyan
చంద్రబాబు కుట్రలపై మరో పుస్తకం రెడీ అయ్యింది. ప్రతిపక్ష నేత చంద్రబాబుపై అల్లుడు సుద్దులు అనే పుస్తకాన్ని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి రాశారు. ఈ పుస్తకాన్ని త్వరలోనే విడుదల చేస్తానని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి తెలిపారు.
 
టీడీపీ మేనిఫెస్టో అంతా మోసపూరిత హామీలేని నందమూరి లక్ష్మీ పార్వతి విమర్శించారు. పథకాలతో రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని గతంలో చంద్రబాబు ప్రచారం చేసిన విషయాన్ని నందమూరి లక్ష్మీ పార్వతి గుర్తు చేశారు. అలాంటి చంద్రబాబు ఇప్పుడు టీడీపీ మేనిఫెస్టో గురించి ఏమంటారని నందమూరి లక్ష్మీ పార్వతి ప్రశ్నించారు. చంద్రబాబు హామీలు అమలు చేయాలంటే  ఆర్బీఐ సొమ్ము కూడా చాలదని లక్ష్మీపార్వతి ఎద్దేవా చేశారు. ఇక నారా లోకేష్‌ది పాదయాత్ర కాదని.. అది ఈవినింగ్‌ వాక్‌ అని నందమూరి లక్ష్మీ పార్వతి ఎద్దేవా చేశారు. మరి తాజా పుస్తకంలో ఆమె ఎన్ని సంచలనాలు బయటపెట్టారో?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: