గతేడాది ఏపీకి ఇన్ని పెట్టుబడులు వచ్చాయా?
ఏపీ నుంచి బహుళ ఉత్పత్తులు, బహుళ దేశాలకు ఎగుమతులు ఎంఎస్ఎంఈలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఎంఎస్ఎంఈలకు అవసరమైన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందేలా చూడాలని సీఎం జగన్ అన్నారు. పరిశ్రమల శాఖలో ఎంఎస్ఎంఈల కోసం ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని సీఎం జగన్ వారికి ఆదేశించారు. దీని కోసం ఒక కార్యదర్శిని కూడా నియమించాలని సీఎం జగన్ వారికి సూచించారు.