తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌?

Chakravarthi Kalyan
తెలంగాణ కానిస్టేబుల్‌ మెయిన్స్ ప్రిలిమినరీ కీ ని విడుదల చేసినట్టు పోలీసు నియామక మండలి తెలిపింది. కానిస్టేబుల్‌ సివిల్‌, పిసి డ్రైవర్‌, మెకానిక్‌, ట్రాన్స్‌పోర్ట్‌, ఎక్సైజ్, ఐటి తత్సమాన పోస్టులకు నిర్వహించిన తుది పరీక్ష ప్రిలిమినరీ కీ వెబ్‌సైట్‌లో పెట్టినట్టు పోలీసు నియామక మండలి ప్రకటించింది. www.tslprb.in వెబ్‌ సైట్ లో కీ ను అందుబాటులో ఉంచినట్లు పోలీసు నియామక మండలి తెలిపింది.
ఈ కీపై  అభ్యంతరాలను 24 మే సాయంత్రం 5గంటల లోపు తెలియజేయాలని..ఇందుకు  ప్రత్యేక ప్రోఫార్మా వెబ్‌ సైట్‌ లో ఉంచినట్టు పోలీసు నియామక మండలి పేర్కొంది. అభ్యంతరం ఉన్న ఒక్కో ప్రశ్నకు ప్రొఫార్మా ప్రకారం సబ్‌మిట్ చేయాలని....ఇందుకు సంబంధిచిన డాక్యుమెంట్ ను అప్‌ లోడ్ చేయాలని పోలీసు నియామక మండలి తెలిపింది. అసంపూర్తిగా అభ్యర్ధన ఉంటే దాన్ని పరిగణలోకి తీసుకోమని పోలీసు నియామక మండలి స్పష్టం చేసింది. అభ్యర్థులు ఓఎంఆర్‌ షీట్లను ఫైనల్‌ కీ ని విడుదల చేసే సమయంలో వారి లాగిన్‌ లో ఉంచనున్నట్లు మండలి వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

key

సంబంధిత వార్తలు: