Breaking: ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ మృతి!

Purushottham Vinay
టాలీవుడ్ పరిశ్రమలో మరో విషాదం జరిగింది. కొద్ది సమయం క్రితమే టాలీవుడ్ సీనియర్ సంగీత దర్శకుడు రాజ్‌ కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం నాడు గుండెపోటుతో మృతి చెందారు.తెలుగు సినీ ప్రియులకు ఎవర్ గ్రీన్ సాంగ్స్ అందించిన 'రాజ్‌-కోటి' ద్వయంలో రాజ్ కూడా ఒకరు. ఆయన పూర్తి పేరు తోటకూర సోమరాజు కాగా రాజ్‌  టాలీవుడ్‌లో ఫేమస్ అయ్యారు. ఇక రాజ్ మరణ వార్త తెలుగు సినీ పరిశ్రమను పూర్తిగా విషాదంలోకి నెట్టేసింది.మ్యూజిక్ డైరెక్టర్ రాజ్  అలనాటి సంగీత దర్శకుడు టీవీరాజు కుమారుడు. ఇక రాజ్‌-కోటి ద్వయం కలిసి 180కి పైగా మూవీలకు సంగీతం అందించారు. 


వీటిలో ఉదయం, లేడీ జేమ్స్‌బాండ్, ఉక్కు సంకెళ్లు, పున్నమి రాత్రి, మధన గోపాళుడు, యముడికి మొగుడు, ఖైదీ నెం.786, రౌడీ నెం. 1, త్రినేత్రుడు, విక్కీ దాదా, కొదమ సింహం, కొండవీటి రౌడీ, హల్లో బ్రదర్స్ వంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలు కూడా ఉన్నాయి.హల్లో బ్రదర్స్ మూవీకి రాజ్‌-కోటి ద్వయం బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా నంది అవార్డును కూడా అందుకున్నారు. అయితే కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే వారి మధ్య విభేదాలు వచ్చి ఆ తర్వాత వీరిద్దరూ విడిపోయి ఎవరికి వారు విడివిడిగా సినిమాలు చేశారు. అలా రాజ్ సొంతంగా 10 చిత్రాలకు మ్యూజిక్‌ అందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: